
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయని హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ తెలిపింది. ఇది ఇంటర్వ్యూ చేసిన యజమానులలో 45 శాతం మంది కొత్త జాబ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. 13 శాతం మంది తమ ప్రస్తుత స్థానాల్లో కొత్త వారిని నియమించాలని భావిస్తున్నా రు. 1,520 మంది సీఎక్స్ ఓలు, సీనియర్ ఎగ్జి క్యూటిన్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ రిపోర్ట్ తయారయింది. తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు ఇష్టపడుతున్నాయి. 26 శాశం యజమానులు తాత్కాలిక కాంట్రాక్టు లేదా ప్రాజెక్ట్ ఆధారిత జాబ్ పై దృష్టి పెట్టారు.
16 శాతం సంస్థలు 2026 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వబోమని సృష్టం చేశాయి. 37 శానం యజమానులు మధ్య నిపుణులను నియమించుకోవాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. 26 శాతం మంది గిగ్ వర్కర్లు కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. ఎంట్రీ లెవల్ జాబ్స్ ఇస్తామని 19 శాతం నుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థానాలను భర్తీ చేసామని 18 శాతం మంది యం మానులు వెల్లడించారు. 5.3 శాతం సంస్థలు 5-10 శాతం సిబ్బందిని నియమించుకోనున్నాయి. 33 శాతం సంస్థలు 10 -15 శాతం కంటే ఎక్కువ సంఖ్యలో అవకాశాలను ఇవ్వనున్నాయి.
రిటైల్, ఈ-కామర్స్ నుంచి భారీగా అవకాశాలు రిటైల్, ఈ-కామర్స్, క్విక్ కామర్స్ రంగం నుంచి 21శాతం ఉద్యోగాలు రానున్నాయి. లాజిస్టిక్స్, వే దో హౌసింగ్ కోసం ఉద్యోగులు కావాలని తొమ్మిది శాతం మంది యజమానులు తెలిపారు. 15 శాతం యజమానులు ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అరిక నియామకాలు ఉంటాయని, 11 శాతం ముంది పునరుత్పాదక శక్తి, ఇంధనం, ఇంజనీరిం ప్రాజెక్టులలో నియామక అవసరాలు పెరుగుతాయని చెప్పారు.
బటీ సేవలు, టెలికాం టెక్నాలజీ (1.3 శాతం), తయారీ, ఇంజనీరింగ్ ఉత్పత్తి (11 శాతం), మౌలిక సదుపాయాలు రవాణా రియల్ ఎస్టేట్ (10 శాతం), బీఎస్ఎఫ్ ఐ (9 శాతం) రంగాలు కూడా భారీగానే ఉద్యోగాలను సృష్టించనున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసిడీ, హెల్త్ కేర్, హా స్పిటాలిటీ, మీడియా వినోదం, విద్యవంటిరంగాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువ ఉద్యోగాలు ఇచ్చే రంగాలని తేలింది.