ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఈఏడాది ఎసెంట్ లో ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా మహమ్మారితో ఇంటర్ పరీక్షలకి ఫీజులు చెల్లించి… పరీక్షలు రాసి ఫెయిన్ అయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేదు. దాంతో ఆ స్టూడెంట్లకి 35 శాతం మార్కులు వచ్చినట్టుగా బోర్డు ప్రకటించింది. ఎంసెట్ షరతుల ప్రకారం 45శాతం మార్కులు రాకపోవడంతో వీళ్ళకి కౌన్సెలింగ్ కి హాజరయ్యే ఛాన్స్ లేకపోయింది.

దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైకోర్టు ఆశ్రయించారు. పిటిషన్లు విచారించిన కోర్టు… విద్యార్థులకు న్యాయం చేయాలనీ అంతవరకూ ఎంసెట్ కౌన్సెలింగ్ సెకండ్ ఫేజ్ ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో … ఎంసెట్ కి ఇంటర్ వెయిటేజ్ లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చి… ఇంటర్ లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.