నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీఈఎల్‎లో ఉద్యోగాలు.. అర్హతలు, వేతనం పూర్తి వివరాలు ఇవే..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీఈఎల్‎లో ఉద్యోగాలు.. అర్హతలు, వేతనం పూర్తి వివరాలు ఇవే..!

నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) గుడ్ న్యూస్ చెప్పింది. బీఈఎల్‎లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగంలో మొత్తం 350 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన బీఈఎల్.. అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు 2025, జనవరి 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్ సైట్  bel-india.in ద్వారా అప్లికేషన్లు సమర్పించాలని అభ్యర్థులకు తెలిపింది. అలాగే పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, శాలరీ వంటి పూర్తి వివరాలను నోటిఫికేషన్‎లో వివరంగా వెల్లడించింది.

విద్యార్హతలు:

అభ్యర్థులు BE / B.Tech / B.Scలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. వయస్సు కనీసం 25 సంవత్సరాలు ఉండాలి. 

జీతం: సంవత్సరానికి రూ.13 లక్షల ప్యాకేజీ

ఎంపిక విధానం:

సెలక్షన్ ప్రాసెస్ రెండు భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ ఆన్ లైన్ ఎగ్జామ్. క్వాలిఫై అయిన వారికి సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆమోదించబడిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు.  సీబీటీలో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూ‎కు పిలుస్తారు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ & ఈఎస్ఎంకి చెందిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 35 శాతం సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్లూబీడీకి చెందిన అభ్యర్థులు కనీసం 30%  మార్కులు సాధించాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో మెరిట్ క్రమంలో ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. కంప్యూట్ ఆధారిత పరీక్షకు 85 మార్కులు, ఇంటర్వ్యూ 15 మార్కులు.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ & ఈఎస్ఎం అభ్యర్థులకు- రూ. 1180
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్లూబీడీ క్యాండిడేట్లకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.