హైదరాబాద్‌లోని సిటీ బస్సుల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌తో ప్రయాణం చేస్తున్న వారికి టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మెట్రోఎక్స్‌ప్రెస్ బస్ పాస్‌తో ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తమ దగ్గర ఉన్న బస్ పాస్‌తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. మెట్రో ఎక్స్ ప్రెస్‌తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్ పాస్ దారులు కూడా ఈ రాయితీని పొందవచ్చు. 2025, జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది.
ALSO READ | ఆర్టీసీ బస్సులో అద్భుతం.. ఇతని టాలెంట్ మీరు చూడాల్సిందే
ప్రయాణికులకు ఈ వెసులుబాటు కల్పించడంపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. "హైదరాబాద్‌లో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాసులున్నాయి. వారిలో ఎక్కువగా వీకెండ్లో సొంతూళ్లకు వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే బస్ పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్సైట్ tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందవచ్చు. జనరల్ బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం." అని చెప్పారు.