చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగించేవాళ్లు డ్యూయల్ సిమ్ కార్డ్‌లను వాడుతుంటారు. సాధారణంగా ఒకదాన్ని సాధారణ కాల్స్ కోసం, డేటా కోసం ఉపయోగిస్తున్నారు. మరొకటి అత్యవసర పరిస్థితుల కోసం బ్యాకప్‌గా ఉంచుతారు. సెకండరీ SIM తరచుగా తక్కువ తరచుగా ఉపయోగించబడుతుంది కాబట్టి డిస్‌కనెక్ట్‌ను నివారించడానికి రీచార్జ్ తప్పని సరి అవుతుంది. అయితే గత జూలైలో రీఛార్జ్ ప్లాన్‌లలో ధరల పెరుగుదల కారణంగా సెకండరీ సిమ్‌ను రీచార్జ్ పెద్ద సవాల్ గా మారింది. ఈ సమస్యనుంచి కస్టమర్లను బయటపడేసేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ సెకండరీ సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచేందుకు కొత్త నిబంధనలు తెచ్చింది. TRAI కస్టమర్ హ్యాండ్‌బుక్ ప్రకారం.. SIM కార్డ్ 90 రోజులు లేదా దాదాపు మూడు నెలల పాటు ఉపయోగించకుంటే అది డియాక్టివేట్ చేయబడినట్లుగా పరిగణించబడుతుంది.
ఒక SIM 90 రోజుల పాటు వాడకుండా ఉండి.. ఇంకా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ కలిగి ఉంటే దాని యాక్టివేషన్‌ను అదనంగా 30 రోజుల పాటు పొడిగిస్తారు. బ్యాలెన్స్ సరిపోకపోతే SIM డియాక్టివేట్ చేయబడుతుంది. ఇన్ కమింగ్ , అవుట్ గోయింగ్ కాల్స్ , ఇంటర్నెట్ డిస్ కనెక్ట్ అవుతుంది.ఒకసారి డియాక్టివేట్ చేసిన తర్వాత ఆ సిమ్ కొత్త వారికి కేటాయించడం జరుగుతుంది.
జియో కస్టమర్లకు మూడు నెలల వరకు వాడకుండా ఉంచిన రెండో సిమ్ ను మూడు నెలల పాటు యాక్టివేట్ గా ఉంటుంది.. ఆ తర్వాత రీయాక్టివేషన్ చేసుకోవాల్సి ఉటుంది. ఇది రీచార్జ్ ప్లాన్లను బట్టి వర్తిస్తుంది.
Also Read :- ట్రంప్ నిర్ణయంతో.. అమెరికాను వీడనున్నభారతీయులు
ఎయిర్ టెల్ సిమ్ కార్డులు కూడా జియో మాదిరిగానే రీచార్జ్ చేయకుండా అంటే వాడకుండా 90 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది.. అయితే అదనంగా 15 గ్రేస్ పీరియడ్ ఉంటుంది.. ఆ తర్వాత కూడా రీచార్జ్ చేయకపోతే సిమ్ డీయాక్టివేట్ అయిపోతుంది.
ఇక .. వొడాఫోన్ ఐడియా సంబంధించి కూడా ఇదే మూడు నెలల సిమ్ వ్యాలిడిటి ఉంటుంది.. ఆ తర్వాత మినిమ్ 40 రూపాయలతో రీచార్జ్ చేయాల్సి ఉంటుంది.
బీఎస్ ఎన్ ఎల్ సిమ్ అయితే.. 180 రోజులు వరకు యూజ్ చేయకున్నా యాక్టివ్ గానే ఉంటుంది. ఎక్కువ కాలం సిమ్ యాక్టివేట్ గా ఉండాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.
2024 జూలైలో రీఛార్జ్ ప్లాన్‌లలో ధరల పెరుగుదల కారణంగా సెకండరీ సిమ్‌ను రీచార్జ్ పెద్ద సవాల్ గా మారింది. ఈ సమస్యనుంచి కస్టమర్లను బయటపడేసేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది.. TRAI కస్టమర్ హ్యాండ్‌బుక్ ప్రకారం.. SIM కార్డ్ 90 రోజులు లేదా దాదాపు మూడు నెలల పాటు ఉపయోగించకుంటే అది డియాక్టివేట్ చేయబడినట్లుగా పరిగణించబడుతుంది.