వేగంగా కోలుకుంటున్న పంత్.. 140 కి.మీ వేగంతో విసిరే బంతులతో ప్రాక్టీస్

వేగంగా కోలుకుంటున్న పంత్.. 140 కి.మీ వేగంతో విసిరే బంతులతో ప్రాక్టీస్

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యం గురుంచి గుడ్ న్యూస్ అందుతోంది. పంత్ వేగంగా కోలుకోవడమే కాదు.. గంటకు 140 కి.మీ వేగంతో విసిరే బంతులను ధైర్యంగా ఎదుర్కుంటున్నాడట.

గతేడాది డిసెంబర్ 30న రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ గాయాల నుంచి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న అతను.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీ(ఎన్‌సీఏ) రీహ్యాబిలిటేషన్‌లో ఉన్నాడు. రోజురోజుకు అతను మరింత మెరుగవుతున్నట్లు ఎన్‌సీఏ వర్గాలు వెల్లడించాయి. అతను కోలుకుంటున్న తీరు చూసిఎన్‌సీఏ సిబ్బంది కూడా ఆశ్చర్యపోతున్నారట.

అలా అని ఇప్పుడే ప్రొఫెషనల్ క్రికెట్ లోకి తిరిగొచ్చేంత ఫిట్‌నెస్ మాత్రం కాదు. క్రీజులో అవసరమైనట్లుగా తన శరీరాన్ని మెల్లగా కదిలించే ప్రయత్నాలు చేస్తున్నాడు. రాబోవు రెండు నెలల్లో దీనిపై మరింత దృష్టి సారిస్తామని ఎన్‌సీఏ వర్గాలు వెల్లడించాయి. పంత్ గుండె ధైర్యం చూస్తుంటే.. అతడు తిరిగి జట్టులో చేరడానికి ఎక్కువ సమయం పట్టదనే చెప్పుకోవాలి.