Gold Rates : ఈ వీకెండ్‌లో బంగారమే కాదు.. వెండి ధరలు కూడా తగ్గాయ్ : ఈ పతనం ఎంత వరకు..?

Gold Rates : ఈ వీకెండ్‌లో బంగారమే కాదు.. వెండి ధరలు కూడా తగ్గాయ్ : ఈ పతనం ఎంత వరకు..?

Gold Price Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ భయాలు ప్రస్తుతం పసిడి, వెండి వంటి ఖరీదైన లోహాల రేట్ల విషయంలో పెద్దగా కనిపించటం లేదు. రేట్ల ప్రకటనకు ముందు హడావిడిగా ఇన్వెస్టర్లు వీటిలో ఇన్వెస్ట్ చేసినప్పటికీ ప్రస్తుతం వీటి కంటే మరింత సేఫ్ పెట్టుబడుల కోసం వారు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే బంగారం వెండి రేట్లు సమీప భవిష్యత్తులో మరో 5 శాతం వరకు కరెక్షన్ చూసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే శ్రీరామ నవమికి ముందు ధరలు తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా వారు వారాంతంలో షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కేవలం శుక్రవారం, శనివారంలో 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.25 వేల భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో చాలా మంది ప్రస్తుతం బంగారం షాపులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 310, ముంబైలో రూ.8వేల 310, దిల్లీలో రూ.8వేల 325, కలకత్తాలో రూ.8వేల 310, హైదరాబాదులో రూ.8వేల 310, విజయవాడలో రూ.8వేల 310, కేరళలో రూ.8వేల 310, వడోదరలో రూ.8వేల 315, జైపూరులో రూ.8వేల 325, మంగళూరులో రూ.8వేల 310, నాశిక్ లో రూ.8వేల 313, అయోధ్యలో రూ.8వేల 325, గురుగ్రాములో రూ.8వేల 325, నోయిడాలో రూ.8వేల 325 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి కేవలం రెండు రోజుల్లో 100 గ్రాములకు ఏకంగా రూ.27వేల 200 తగ్గింపును చూశాయి. దీంతో నేడు దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ రేటును గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 066, ముంబైలో రూ.9వేల 066, దిల్లీలో రూ.9వేల 081, కలకత్తాలో రూ.9వేల 066, హైదరాబాదులో రూ.9వేల 066, విజయవాడలో రూ.9వేల 066, కేరళలో రూ.9వేల 066, వడోదరలోరూ.9వేల 071, జైపూరులో రూ.9వేల 081, మంగళూరులో రూ.9వేల 066, నాశిక్ లో రూ.9వేల 069, అయోధ్యలో రూ.9వేల 081, గురుగ్రాములో రూ.9వేల 081, నోయిడాలోరూ.9వేల 081గా ఉన్నాయి. 

వెండి కొనుగోలుదారులకు శుభం..
చాలా కాలంగా దేశవ్యాప్తంగా వెండి ధరలు కేజీకి రూ.లక్ష మార్కును దాటేసి ఆందోళనకర స్థాయిలకు చేరుకున్నాయి. ఒకానొక సమయంలో రిటైల్ మార్కెట్లో కేజీ వెండి రేటు రూ.లక్ష 20 వేల సమీపానికి చేరుకుంది. అయితే గడచిన మూడు రోజుల్లో గోల్డ్ రేట్లు దేశంలో కేజీకి రూ.11 వేల భారీ తగ్గింపును చూశాయి. దీంతో మెుత్తం మీద గడచిన వారం రోజులుగా వెండి ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. దీంతో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ వెండి రేటు కేజీకి పరిశీలిస్తే.. రూ.లక్ష 3వేల వద్ద నేడు విక్రయించబడుతోంది. దీంతో వెండి వస్తువులు, ఆభరణాలు కొనాలనుకుంటున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.