Gold Rate: నేడు కుప్పకూలిన బంగారం ధర.. హైదరాబాదులో రూ.3300 తగ్గిన రేటు

Gold Rate: నేడు కుప్పకూలిన బంగారం ధర.. హైదరాబాదులో రూ.3300 తగ్గిన రేటు

Gold Price Today: గడచిన కొన్ని వారాలుగా బంగారం ధరలు భారతదేశంలో పెరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే ట్రంప్ దూకుడు నిర్ణయాలతో పాటు దిగజారిన అంతర్జాతీయ రాజకీయ పరిణామాలుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య మెుదలైన పోరు నుంచి పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఇప్పటికే పెరిగిన పసిడి ధరలు అమెరికా స్పాట్ మార్కెట్లలో ఔన్సుకు దాదాపు 3000 డాలర్ల గరిష్ఠాన్ని దాటేసి ప్రపంచవ్యాప్తంగా పసిడి ప్రియులకు నిద్రలేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ కొనుగోలుదారుల మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తగ్గిన రేట్లతో షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. అయితే దీనికి ముందు వారు ఖచ్చితంగా నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలించాల్సి ఉంటుంది. 

Also Read : ఆన్‌‌‌‌లైన్ యాడ్స్‌‌‌‌పై తొలగనున్న డిజిటల్ ట్యాక్స్‌‌‌‌

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.3000 తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8185, ముంబైలో రూ.8185, దిల్లీలో రూ.8200, కలకత్తాలో రూ.8185, పూణేలో రూ.8185, బెంగళూరులో రూ.8185, వడోదరలో రూ.8190, జైపూరులో రూ.8200, మధురైలో రూ.8185, మంగళూరులో రూ.8185, నాశిక్ లో రూ.8188, అయోధ్యలో రూ.8200, నోయిడాలో రూ.8200 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ పేర్కొన బడిన రేట్లకు అదనంగా జీఎస్టీ, షాపు యజమానులు వేసే తరుగు, మజూరి వంటి అదనపు ఛార్జీలు కూడా ఉంటాయని గమనించాల్సిందే.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరను పరిశీలిస్తే నిన్నటితో పోల్చితే నేడు రూ.3300 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే..  గ్రాముకు చెన్నైలో రూ.8929, ముంబైలో రూ.8929, దిల్లీలో రూ.8944, కలకత్తాలో రూ.8929, పూణేలో రూ.8929, బెంగళూరులో రూ.8929, వడోదరలో రూ.8934, జైపూరులో రూ.8944, మధురైలో రూ.8929, మంగళూరులో రూ.8929, నాశిక్ లో రూ.8932, అయోధ్యలో రూ.8944, నోయిడాలో రూ.8944 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8185 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.8929గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1,10,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.