
1వGold Price Today: నిన్నటి వరకు పసిడి ధరలు అమెరికా కొత్త టారిఫ్స్ రేట్ల భయాలతో భారీగా పెరుగుదలను చూశాయి. అయితే ట్రంప్ తన కొత్త సుంకాలను ప్రకటించిన మరుసటి రోజునే బంగారం ధరలు ఆకాశం నుంచి కిందకు దిగివచ్చాయి. దీంతో శ్రీరామనవమికి ముందు రేట్లు పడిపోవటంపై పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాంతంలో షాపింగ్ చేయటానికి వెళ్లే ముందు నేడు తగ్గిన రిటైల్ ధరలను ప్రజలు తప్పనిసరిగా గమనించాలి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.16వేలు మెగా తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 400, ముంబైలో రూ.8వేల 400, దిల్లీలో రూ.8వేల 415, కలకత్తాలో రూ.8వేల 400, బెంగళూరులో రూ.8వేల 400, కేరళలో రూ.8వేల 400, పూణేలో రూ.8వేల 400, వడోదరలో రూ.8వేల 405, జైపూరులో రూ.8వేల 415, మంగళూరులో రూ.8వేల 400, నాశిక్ లో రూ.8వేల 403, అయోధ్యలో రూ.8వేల 415, బళ్లారిలో రూ.8వేల 400, గురుగ్రాములో రూ.8వేల 415, నోయిడాలో రూ.8వేల 415గా కొనసాగుతున్నాయి.
Also Read :- మరింత ఈజీగా పీఎఫ్ విత్‌డ్రా
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.17వేల 400 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 164, ముంబైలో రూ.9వేల 164, దిల్లీలో రూ.9వేల 179, కలకత్తాలో రూ.9వేల 164, బెంగళూరులో రూ.9వేల 164, కేరళలో రూ.9వేల 164, పూణేలో రూ.9వేల 164, వడోదరలో రూ.9వేల 169, జైపూరులో రూ.9వేల 179, మంగళూరులో రూ.9వేల 164, నాశిక్ లో రూ.9వేల 167, అయోధ్యలో రూ.9వేల 179, బళ్లారిలో రూ.9వేల 164, గురుగ్రాములో రూ.9వేల 179, నోయిడాలో రూ.9వేల 179 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 400 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల 164గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4వేలు భారీ తగ్గింపుతో రూ.1లక్ష 08వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.