2023-24 వానాకాలం, యాసంగి మిల్లింగ్ గడువు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: 2023-24 వానాకాలం, యాసంగి మిల్లింగ్ గడువును ఈ నెల 15వరకు  పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ దీపేంద్ర సింగ్ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 21న రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటివరకు 2024 -25 సీఎంఆర్ డెలివరీ కాకుండా చూసుకోవాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.