Good News : అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్

తెలంగాణ ప్రభుత్వం అంగన్  టీచర్లు, హెల్పర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష  చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు   రహమత్ నగర్ లో జరిగిన అమ్మమాట - అంగన్ వాడీ బాట  కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రకటించారు.రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పారు. అంగన్ వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు.

జీవో 10 రద్దు చేయాలని,, తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్ వాడీ టీచర్లు,హెల్పర్లు  , గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. జూలై 15న సీఐటీయూ ఆధ్వర్యంలో  రాష్ట్ర  వ్యాప్తంగా కలెక్టరేట్ లు, ఎమ్మెల్యేల ముట్టడికి యత్నించారు అంగన్ వాడీలు. ఈ క్రమంలో ఇవాళ ప్రభుత్వం నుంచ ిప్రకటన రావడంతో అంగన్ వాడీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read:-బర్ల దొడ్డి కాదు.. బడి వంటగది!