చుక్కల మందుకు చక్కటి స్పందన

చుక్కల మందుకు చక్కటి స్పందన

నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రతి ఒక్కరూ 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఆదివారం రాజీవ్ గాంధీ చౌక్ లో పోలియో డ్రాప్స్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డుల్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆరు గ్యారంటీలకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు, డిప్యూటీ డీఎంహచ్​వో సంతోష్, మెడికల్ ఆఫీసర్ రాజేశ్వర్, హెల్త్ అసిస్టెంట్ భాస్కర్ పాల్గొన్నారు.