వంటగది పెద్దగా ఉంది
మా ఇంటికి తూర్పు వాకిలి. ఇంటి ఆగ్నేయంలో కొట్టుగది ఉంది. అందులో వడ్లు వేస్తాం. దాని వెనక దేవుడి గది, తర్వాత వంటగది. కొట్టుగది చిన్నది. వంటగది బాగా పెద్దది. ఆ ఇంట్లో మాకు బాగానే కలిసొచ్చింది. కానీ చాలామంది సిద్ధాంతులు కొట్టుగదిని వంటగది చేయమని సలహా ఇస్తున్నారు. నేను పట్టించుకోలేదు. కానీ మా చిన్నమ్మాయి పెళ్లి ఆలస్యం అవుతోంది. దానికి,ఇంటి వాస్తుకు సంబంధం ఉందంటారా?
సంబంధం ఉండొచ్చు. ఎందుకంటే, ఇంటి దక్షిణంలో నైరుతి భాగం ఎక్కువగా ఉంటే సమస్యలు వస్తాయి. ఇంటిని నాలుగు భాగాలు చేస్తే 1/4 వంటగది ఉండాలి. అంతకంటే ఎక్కువభాగంలో వంటిల్లు ఉంటే ఇబ్బంది. వంటగది చిన్నదిగా, కొట్టుగది పెద్దదిగా ఉంటే, అది దక్షిణభాగం నైరుతి వైపు ఉంటే తప్పు కింద లెక్క. దాన్ని సరిచేసుకోవాలి. ఆ గదిని కూడా 1/4 లోపలే వచ్చేట్టు కట్టుకోవాలి. వంటగది తూర్పు ఆగ్నేయంలో మాత్రమే ఉండాలి. వంట చేసేవాళ్లు తూర్పు ముఖం పెట్టి వండాలి. మీ ఇంటిని మీకు దగ్గర్లో ఉన్న సిద్ధాంతికి చూపించి, సలహాలు తీసుకుని, మార్చుకోండి.
నాగిరెడ్డి, ఖమ్మం
నైరుతిలో ఉండకూడదు
మాది ఉత్తర సింహద్వారం ఇల్లు. తూర్పు వైపు ఐదడుగుల ప్యాసేజ్ ఉంది. ప్యాసేజ్ ఎదురుగా మెట్ల కింది నైరుతిలో బాత్రూం ఉంది. అయితే బాత్రూం ఆ స్థలంలో ఉండొచ్చా? ఇంట్లోకి ప్యాసేజ్ మార్గం గుండా వచ్చేవాళ్లకు ఎదురుగా బాత్రూం ఉండటం కొంత ఇబ్బందిగా ఉంది. తగిన సలహా ఇవ్వండి?
నైరుతిలో బాత్‌రూం ఉండటం వాస్తు ప్రకారం మంచిది కాదు. దాని వల్ల ఇంట్లో వాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. దాన్ని స్టోర్ రూం చేసుకుంటే సరిపోతుంది. బాత్రూం కావాలంటే ఉత్తర వాయువ్యంలో బిల్డింగ్‌కు, ఉత్తర కాంపౌండ్ గోడకు తగలకుండా, పడమట గోడకు ఆన్చి కట్టుకోవచ్చు. అప్పుడు ప్యాసేజ్ మార్గం నుంచి వచ్చే వాళ్లకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
యాదగిరి, కరీంనగర్
ఎదురింటికి మారొచ్చా?
మేం ఇల్లు మారాలని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న ఇల్లు, కొత్తగా మారాలనుకున్న ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి. మధ్యలో రోడ్ ఉంది. ఇప్పుడున్న ఇంటి వాకిలి దక్షిణం దిక్కులో ఉంటే, మారే ఇంటి వాకిలి తూర్పు దిక్కులో ఉంది. మెయిన్ గేట్లు మాత్రం ఎదురెదురుగా ఉన్నాయి. మేం మారడం వల్ల ఇబ్బందులేమన్నా వస్తాయా?
దక్షిణం వాకిలి ఉన్న ఇంటి నుంచి తూర్పు వాకిలి ఉన్న ఇంటికి మారడం మంచిదే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోరు మారడం వల్ల ఎలాంటి సమస్య రాదు. మధ్యలో రోడ్ ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. వంటిల్లు, సంపు, హాలు, పడకగదులు ఏఏ దిక్కుల్లో ఉన్నాయో తప్పనిసరిగా చూపించుకుని, ఇల్లు మారండి.
కోటేశ్వరరావు, హైదరాబాద్
మెట్ల కింద ఖాళీ మంచిదే!
మా ఇంటికి ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి. వాకిలి తూర్పువైపు ఉంది. మెట్ల కింద బాత్ రూం లాంటివి ఏమీ కట్టలేదు. మెట్ల కింద ఖాళీ స్థలం ఉండకూడదని కొందరు చెప్పారు. మెట్ల కింద పాతసామాను, వాషింగ్ మిషిన్ లాంటివి పెట్టుకోవచ్చా? ఖాళీగా ఉంచినా పర్వాలేదా?
మెట్ల కింద కచ్చితంగా బాత్‌రూం కట్టుకోవాలనేం లేదు. ఆగ్నేయం అంటున్నారు కాబట్టి, అది సమస్య కాదు. పాతసామాన్లు పెట్టుకున్నా, వాడే వస్తువులు ఉన్నా, వాస్తు ప్రకారం ఎలాంటి నష్టం జరగదు. ఆగ్నేయం కాబట్టి ఖాళీగా వదిలేసినా మంచిదే. మీ అవసరాన్ని బట్టి ఆ స్థలాన్ని వాడుకోండి.
ఎస్ఎల్వీ శర్మ, ఉప్పల్
వాస్తు సిరి కాశీనాథుని శ్రీనివాస్, వాస్తు కన్సల్టెంట్ : 9440088799