మహబూబాబాద్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌ సమీపంలో..తెగిన గూడ్స్‌‌‌‌ లింక్‌‌‌‌

మహబూబాబాద్ అర్బన్, వెలుగు : గూడ్స్‌‌‌‌ రైలు వ్యాగన్ల మధ్య లింక్‌‌‌‌ తెగిపోవడంతో మూడు వ్యాగన్లు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌ సమీపంలోని 436/12 కిలోమీటర్‌‌‌‌ రాయి వద్ద మంగళవారం జరిగింది. ఓ గూడ్స్‌‌‌‌ రైల్‌‌‌‌ సోమవారం డోర్నకల్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌ నుంచి కాజీపేట వెళ్తోంది. ఈ క్రమంలో మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రం సమీపంలోకి రాగానే వ్యాగన్ల మధ్య లింక్‌‌‌‌ తెగింది. 

దీంతో మూడు వ్యాగన్లు అక్కడే నిలిచిపోయాయి. గమనించిన గార్డ్‌‌‌‌ లోకో పైలెట్‌‌‌‌ను అప్రమత్తం చేశాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గూడ్స్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌ వెనక్కి రప్పించి విడిపోయిన వ్యాగన్లను మళ్లీ లింక్‌‌‌‌ చేసి అక్కడి నుంచి పంపించి వేశారు. సుమారు 45 నిమిషాల పాటు వ్యాగన్లు పట్టాలపైనే నిలిచిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.