రెండు రైళ్లు ఢీకొన్నాయి.. 70 కిలోమీటర్ల స్పీడ్ లో ఎగిరిపడ్డాయి

రెండు రైళ్లు ఢీకొనటం సినిమాల్లోనే చూసి ఉంటాం.. ఇప్పుడు రియల్ గా రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అది కూడా 70 కిలోమీటర్ల వేగంతో ఢీకొనటంతో రెండు రైళ్లలోని ఇంజిన్లు తుక్కుతుక్కు అయ్యాయి. బోగీలు ఎగిరిపడ్డాయి. రైళ్లు ఢీకొన్న వేగానికి.. మంటలు చెలరేగాయి. ఈ రెండు రైళ్లు గూడ్స్ కావటంతో పెను ప్రమాదం తప్పింది. 

బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ లోని సింగ్ పూర్ రైల్వే స్టేషలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. సింగ్ పూర్ రైల్వే స్టేషన్ శివారులో రెండు గూడ్స్ ట్రైన్లు ఢీ కొన్నాయి. ఇంజిన్ ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రైన్ డ్రైవర్లు లోపలే చిక్కుకున్నారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.

రెండు రైళ్లు వేగంగా ఢీ కొనడంతో క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. కొన్ని రకాల గూడ్స్ ఐటమ్స్ మంటల్లో పడి దగ్దం అయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన వాళ్లను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు.