పలాసలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

పలాసలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పలాస రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పగా.. ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.  బరంపురం వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో పలాస వద్ద కొంచెం వెనక్కివచ్చి  పట్టాలు తప్పింది. దీంతో మూడు బోగీలు పక్కకు ఒరిగిపొయాయి. సాంకేతిక లోపం రైలు లింక్ దాటి కొంచెం వెనక్కిరావడంతో అక్కడి సిబ్బంది గమనించి అప్రమత్తం అయ్యేలోపే పట్టాలు విరిగిపొయాయి.  తిరిగి ట్రాక్ పైకి గూడ్స్ పైకి తీసుకొచ్చే పనుల్లో రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.