ఒడిశాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వర్షాల కారణంగా అంగూల్ జిల్లాలో బ్రిడ్జ్ దెబ్బతింది. దీంతో రైలు పట్టాలు తప్పింది. 9 వ్యాగన్లు కింద ప్రవహిస్తున్న వాగులో పడిపోయాయి. కొన్ని వ్యాగన్లు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ధేన్ కనాల్-సంబల్ పూర్ సెక్షన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అది సింగిల్ లైన్ రూట్ కావడంతో... ఆ మార్గంలో వెళ్లే రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఇవాళ ఒక్కరోజే 12 రైళ్లు క్యాన్సిల్ చేసినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. 7 రైళ్లను దారి మళ్లించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని రైల్వే తెలిపింది.