
ఏపీలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో ఒకే ట్రాక్ పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో 9 రైళ్లు రద్దు అయ్యాయి.
విజయవాడ నుంచి లింగపల్లి వెళ్లే రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఒకే ట్రాక్ పై రాకపోకల కారణంగా మరికొన్ని ట్రైన్ సర్వీసులు కూడా ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
విజయవాడ - విశాఖ
గుంటూరు - విశాఖ, విజయవాడ
విజయవాడ - విశాఖ - విజయవాడ
విజయవాడ - గుంటూరు
కాకినాడ పోర్టు - విజయవాడ
పై రైళ్లు పూర్తిగా రద్దవ్వగా.. విజయవాడ - రాజ మహేంద్రవరం, కాకినాడ పోర్టు - విజయవాడ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.