మళ్లీ అదే ట్రాక్ పై..ఒడిశా ఏపీ సరిహద్దులో పట్టాలు తప్పిన గూడ్స్

మళ్లీ అదే ట్రాక్ పై..ఒడిశా ఏపీ సరిహద్దులో పట్టాలు తప్పిన గూడ్స్

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత దేశ వ్యాప్తంగా వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ  రైలు ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లాలో బొగ్గు లోడుతో వెళ్తున్న  గూడ్స్ రైలు  పట్టాలు తప్పింది. అనకాపల్లి– తాడి రైల్వే స్టేషన్ల మధ్య   తెల్లవారు జామున 3.35గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.  సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు  ప్రారంభించారు.  

గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం–విజయవాడ మధ్య నడుస్తున్న పలు రైళ్లు ఆలస్యంగా  నడుస్తున్నాయి.  విశాఖ–లింగంపల్లి వరకు నడుస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌  రద్దు అయింది. విశాఖ–గుంటూరు,సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఇవాళ రద్దు చేశారు. విశాఖ –సికింద్రాబాద్ (వందేభారత్) మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. 

ఈ  రైళ్లు రద్దు

12805– 06 - జన్మభూమి – రాకపోకలు రద్దు
22701–02 ఉదయ్ ఎక్స్‌ప్రెస్ – రాకపోకలు రద్దు
17240–39 - సింహాద్రి – రాకపోకలు రద్దు