![పట్టాలపై పల్టీలు కొట్టిన గూడ్స్ రైలు.. ఏడు రైళ్లు రద్దు](https://static.v6velugu.com/uploads/2023/07/Goods-Train-Derailed-in-Rajasthan_MNTkvOseV6.jpg)
రాజస్థాన్ జైపూర్ లో 2023 జూలై 15న గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్‌లు పట్టాలు తప్పి్ంది. అస్లాపూర్, జోబెర్న్, హిర్నోడా స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతం నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) జైపూర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
పట్టాలు తప్పడం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. 7 రైళ్లను అధికారులు రద్దు చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వీలైనంత త్వరగా రైలు రాకపోకలను కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నారు.
రద్దు చేయబడిన రైళ్ల జాబితా:-
- 19735 జైపూర్-మార్వార్ జంక్షన్ ఎక్స్‌ప్రెస్
- 19736 మార్వార్ జంక్షన్-జైపూర్ ఎక్స్‌ప్రెస్
- 22977 జైపూర్-జోధ్‌పూర్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- 22978 జోధ్‌పూర్-జైపూర్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- 09605 అజ్మీర్-జైపూర్ DEMU స్పెషల్
- 09606 జైపూర్-అజ్మీర్ DEMU స్పెషల్