ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

ఏపీలో ఘోర ప్రమాదం తప్పింది. అల్లూరి జిల్లా అరకులోయ చిమిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇతర రైల్ల రాకపోకలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన గురించి రైల్వే అధికారులు అప్రమత్తమయ్యి  విశాఖ నుంచి వస్తున్న కిరందొల్ పాసింజర్ రైలును కొత్తవలస వద్ద నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.