
సికింద్రాబాద్ నుంచి సేడం వెళ్తున్న గూడ్స్ రైలు బుధవారం తెల్లవారు జామున వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. బొగ్గుతో నిండి ఉన్న 7 డబ్బాలు పక్కకు పడిపోవడంతో బొగ్గు కింద పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలాలనికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు వెళ్లే రూట్‌లో ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.