గూగుల్‌‌‌‌‌‌‌‌లో రేటింగ్స్‌‌‌‌‌‌‌‌, అడ్రస్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ పేరుతో టోకరా

గూగుల్‌‌‌‌‌‌‌‌లో రేటింగ్స్‌‌‌‌‌‌‌‌, అడ్రస్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ పేరుతో టోకరా

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌, వెలుగు :గూగుల్‌‌‌‌‌‌‌‌లో రేటింగ్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ల పేరిట సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ను మోసం చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ యువతికి పార్ట్‌‌‌‌‌‌‌‌టైం జాబ్‌‌‌‌‌‌‌‌ అంటూ వాట్సప్‌‌‌‌‌‌‌‌లో ఓ మెసేజ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. దానిని ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయడంతో గూగూల్‌‌‌‌‌‌‌‌లో రివ్యూస్‌‌‌‌‌‌‌‌ రాయడం, రేటింగ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తులు ఇందుకు కొంత డబ్బు చెల్లించారు. తర్వాత బిట్‌‌‌‌‌‌‌‌ కాయిన్‌‌‌‌‌‌‌‌పై పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో యువతి రూ.1.90 లక్షలు పెట్టుబడి పెట్టింది. తర్వాత వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డెలివరీ అడ్రస్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ అంటూ...

డెలివరీ అడ్రస్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ అంటూ ఓ మహిళను సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు మోసం చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ మహిళకు తన డెలివరీ అడ్రస్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని, లేకపోత ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ రిటర్న్‌‌‌‌‌‌‌‌ అవుతుందంటూ ఓ మెసేజ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. మెసేజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న లింక్‌‌‌‌‌‌‌‌ను క్లిక్‌‌‌‌‌‌‌‌ చేసి అడ్రస్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసిన తర్వాత క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌ నుంచి రూ. 25.02 రూపాయలు చెల్లించింది. కొద్దిసేపటి తర్వాత క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌ నుంచి రూ. 2.43 లక్షలు వాడినట్లు మహిళకు మెసేజ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి క్రెడిట్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ను చేసిన అనంతరం సైబర్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.