మేకిన్ ఇండియా.. భారత్ లో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తయారీ

మేకిన్ ఇండియా.. భారత్ లో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తయారీ

గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో తయారు చేయనున్నట్టు వెల్లడించింది. మేకిన్ ఇండియాలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 'గూగుల్ ఫర్ ఇండియా' అనే కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో.. టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

భారత్ లో తయారైన గూగుల్ పిక్సెల్ ఫోన్లు 2024నుంచి అందుబాటులోకి రానున్నట్టు రిక్ ఓస్టెర్లో ఈ సందర్భంగా చెప్పారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ తయారీ సంస్థలతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. గూగుల్ 2016నుంచి ఆండ్రాయిడ్ బేస్డ్ పిక్సెల్ ఫోన్లను తయారు చేస్తుండగా.. భారత్ లో మాత్రం పిక్సెల్ 7 నుంచే వీటిని రిలీజ్ చేయడం ప్రారంభించింది. ఇంతకుముందు వచ్చిన పిక్సెల్ సిరీస్ లు ఇండియా మార్కెట్ లోకి నేరుగా రాలేదు. ఇటీవలే పిక్సెల్ 8 సిరీస్  ఫోన్లు రూ.75వేల 999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటికే ఫాక్స్ కాన్, పెగాట్రాన్, విస్ట్రోన్ కంపెనీలు యాపిల్ కోసం ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్.. గెలాక్సీ కోసం.. చైనాకు చెందిన షావోమీ సైతం ఇండియాలో తయారీ చేస్తున్నాయి. తాజాగా ఇదే బాటలో గూగుల్ పయనిస్తున్నట్టు ప్రకటించింది.