బిగ్ షాక్: GPay సేవలు మూసివేస్తున్న గూగుల్

చెల్లింపులు చేయాలన్నా, డబ్బులు పంపాలన్నా ఠక్కున గూగుల్ పే(GPay) ఓపెన్ చేస్తున్నారా..! ఇక మీదట అలా చేయలేరు. ఎందుకంటే.. జూన్ 4, 2024 నుండి GPay సేవలు అందుబాటులో ఉండవని గూగుల్ ప్రకటించింది. కాకపోతే ఇది మన దగ్గర కాదు.. యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికాలో. అవును, మీరు విన్నది నిజమే.

గూగుల్ తన గూగుల్ పే(Google Pay) యాప్‌ను యునైటెడ్ స్టేట్స్‌లో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 4, 2024 నుండి GPay సేవలు యూఎస్‌లో ఉనికిలో ఉండవు. Google Wallet ద్వారా ఈ సేవలు పొందవచ్చు. వాస్తవానికి అమెరికాలో గూగుల్ వ్యాలెట్(Google Wallet) వచ్చాక 'GPay' యాప్ వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి వినియోగదారుడు మొదటి ఎంపికగా గూగుల్ వ్యాలెట్‌నే వాడుతున్నారు. దీంతో పాత Google Pay యాప్‌ను నిలిపివేయాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది.

అయితే భారతదేశం, సింగపూర్ వినియోగదారులు మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈ సేవలు యధాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది.