గూగుల్ ఇండియా మేనేజర్ గా ప్రీతి లోబానా.. ఎవరీమె..

గూగుల్ ఇండియా మేనేజర్ గా ప్రీతి లోబానా.. ఎవరీమె..

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాకు సంబంధించి మేనేజర్ గా ప్రీతి లోబానాను నియమించింది. సోమవారం ( డిసెంబర్ 17, 2024 ) ఓ ప్రకటన ద్వారా తెలిపింది గూగుల్.ఇంతకు ముందు ఈ బాధ్యతలు నిర్వహించిన సంజయ్ గుప్తాను గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్‌గా బదిలీ చేయడంతో గూగుల్ ఇండియా మేనేజర్ గా ప్రీతి లోబానాను నియమించినట్లు తెలిపింది గూగుల్. ఈ క్రమంలో ఎవరీ ప్రీతి లోబానా ఎవరు, ఆమె అనుభవం వంటి అంశాల గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

ఎవరీ ప్రీతి లోబానా:

  • ప్రీతి లోబానా టెక్నాలజీ, ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ విభాగంలో  సీనియర్ లీడర్షిప్ రోల్స్ 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కలిగి ఉంది.
  • 30ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న లోబానా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియన్ ఎకానమీపై మంచి పట్టు ఉంది.
  • ప్రీతి లోబానా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ గా, గూగుల్ టెక్ - ప్రాసెస్, పార్టనర్, పబ్లిషర్ ఆపరేషన్స్, యాడ్స్ కంటెంట్, క్వాలిటీ ఆపరేషన్స్‌ విభాగాల్లో పనిచేశారు.
  • గూగుల్ కంటే ముందు లోబానా నాట్‌వెస్ట్ గ్రూప్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మరియు ఏ యన్ జీ గ్రైండ్‌లేస్ వంటి దిగ్గజ సంస్థల్లో బ్యాంక్‌లలో నాయకత్వ స్థానాల్లో పనిచేశారు.
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్‌ పూర్వ విద్యార్థి అయిన లోబానా.. లార్జ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గనైజషన్స్ లో బలమైన టీమ్స్ ని బిల్డ్ చేయటం  వంటి ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నట్లు తెలిపింది గూగుల్.

గూగుల్ ఇండియా మేనేజర్ గా ప్రీతి లోబానా నియామకంతో,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీని కస్టమర్లకు మరింత చేరువ చేయడం,కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తారని గూగుల్ ప్రకటించింది.

Also Read :- భారత దేశ ఎగుమతులు 4.85 శాతం తగ్గినయ్

కస్టమర్-సెంట్రిక్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న ప్రీతి,గూగుల్ ఇండియా లో సేల్స్ అండ్ యాక్టివిటీస్ విభాగంలో కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది గూగుల్.