లోన్ యాప్స్ కు ఈ మధ్య పాపులారిటీ బాగా పెరిగిపోయింది. పాకెట్ మనీ కోసం చాలామంది యువత వీటిపై ఆధారపడుతున్నారు. స్టూడెంట్స్, బ్యాచ్ లర్స్ టార్గెట్ గా చేసుకుని ఇష్టారీతిన లోన్స్ ఇస్తున్నాయి లోన్ యాప్స్. వీటిలో తీసుకున్న లోన్స్ ఎలాగోలా తీర్చేయొచ్చు అనుకున్న యువత.. లోన్ యాప్స్ ఊబిలో పడి నలిగిపోతున్నారు. వాళ్లు వేసే అధిక వడ్డీ రేట్లు కట్టలేక.. ప్రాణాలు తీసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు.
దాంతో గూగుల్ కొన్ని లోన్ యాప్స్ ను బ్యాన్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్ పాలసీని ఉల్లంఘించినందుకు దాదాపు 3,500 లోన్ యాప్స్ ను బ్యాన్ చేసింది. మోసపూరిత చర్య, దుర్వినియోగ లావాదేవీలు జరిపి యూజర్ల నుంచి కోట్ల రూపాయలు కొట్టేశాయి లోన్ యాప్స్. చాలా కాలంగా అలాంటి వాటిని పర్యవేక్షించిన గూగుల్.. ఆ యాప్స్ ను బ్యాన్ చేసింది.