న్యూయార్క్: చైనాతో లింక్ ఉండి తప్పుడు ఇన్ఫర్మేషన్ను స్ప్రెడ్ చేస్తున్న 2,500 యూట్యూబ్ చానెల్స్ ను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. గూగుల్ కు చెందిన యూట్యూబ్ కొన్ని నెలలుగా చైనా ఇన్ ఫ్లూయెన్స్ తో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న చానెల్స్ ను తొలగిస్తోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దాదాపు 2,500 చైనా ప్రభావంతో నడుస్తున్న చానెల్స్ ను గుర్తించి తొలగించినట్లు గురువారం ప్రకటించింది. ఆ చానెల్స్ వివరాలను మాత్రం గూగుల్ వెల్లడించలేదు. ఐతే తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్న చానెల్స్ వెనక చైనా ఉందన్న ఆరోపణలను యూఎస్ లోని చైనా ఎంబసీ ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే చైనాపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపింది.
For More News..