గూగుల్ డ్రైవ్‪లో ఆ ఫొటోలు ఉంటే మీ మెయిల్ గోవిందా

గూగుల్ డ్రైవ్‪లో ఆ ఫొటోలు ఉంటే మీ మెయిల్ గోవిందా

ఫోన్‪లో ఉన్న ఫొటోస్  మొబైల్ మార్చినా, పోయినా జీ మెయిల్‌తో  వాటిని వెంటనే తిరిగి పొందవచ్చు. ఏలాగంటే గూగుల్ డ్రైవ్‌లో ఫొటోస్ బ్యాక్ అప్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే మన గూగుల్ మెయిల్ ఐడీ ఉన్నన్నీ రోజులు ఫొటోస్ భద్రంగా ఉంటాయి. పొరపాటున గ్యాలరీలో ఫొటోస్ డిలెట్ అయినా వాటిని మళ్లీ బ్యాక్ అప్ చేసుకోవచ్చు. ఇలా ఫొటోస్ గూగుల్ డ్రైవ్ లో దాచిపెట్టుకున్న ఓ వ్యక్తికి గట్టి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లోని ఓ ఇంజనీర్ తన చిన్ననాటి జ్ఞాపకంగా ఒక ఫొటోని గూగుల్ డ్రైవ్ లో అప్ లోడ్ చేశారు. అందుకు గూగుల్ అతని మెయిల్ ఐడీని బ్లాక్ చేసింది.


నీల్ శుక్లా రెండేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ స్నానం చేయిస్తున్న ఫొటోని గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకున్నాడు. ఆ మొబైల్‪ను పిల్లలు దుర్వినియోగం చేస్తున్నారని 2023 ఏప్రిల్‫లో శుక్లా గూగుల్ అకౌంట్‪ని  బ్లాక్ అయింది. మళ్లీ మెయిల్ తిరిగి పొందలేకపోయాడు. దీని వల్ల తను వ్యాపారంలో చాలా నష్టపోయాడు. దీంతో బాధితుడు సెంటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించారు. అయినప్పటికీ, ఏలాంటి ఫలితం లేదు. మార్చి 12న తన అసౌకర్యాని కోర్టులో కేసు కూడా వేశాడు. గూగుల్ ఇండియా ప్రైవేల్ లిమిటెడ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. గూగుల్ చైల్డ్ అబ్యూసింగ్ కంటెంట్ ఉంటే ఇలా మెయిల్ అకౌంట్ బ్లాక్ చేస్తోంది. 

ALSO READ :- కడప ఎంపీగా షర్మిల పోటీ.. వైసీపీకి చెక్ తప్పదా..?