గూగుల్ తన కొత్త మెషీన్ లెర్నింగ్ (ML) అల్గారిథమ్ ను ఉపయోగించిన గూగుల్ మ్యాప్స్, సెర్చింగ్ లో 170 మిలియన్లకు పైగా పాలసీ ఉల్లంఘించే రివ్యూలను బ్లాక్ చేసింది. ఇది గతేడాది కంటే 45 శాతం ఎక్కువ నకిలీ రివ్యూలను తొలగించేందుకు ఈ అల్గారిథమ్ సహాయపడిందని గూగుల్ తెలిపింది. వీటితోపాటు 12 మిలియన్లకు పైగా నకిలీ వ్యాపార ప్రొఫైల్ లను గుర్తించి బ్లాక్ చేసింది.
గతేడాది గూగుల్ తన కొత్త మెషీన్ లర్నింగ్ (ML) అల్గారిథమ్ ను ప్రారంభించింది. ఇది రోజువారీ దీర్ఘకాలికి సంకేతాలను పరిశీలించడం ద్వారా వేగంగా నకిలీ రివ్యూలను గుర్తిస్తుంది. దీంతోపాటు వీడియో మోడరేషన్ అల్గారిథమ్ లను అభివృద్ధి చేయడం ద్వారా 2023లో 14మిలియన్ల పాలసీ ఉల్లంఘనల వీడియోలను గుర్తంచారు. ఇది గతేడాది కంటే 7 మిలియన్లు ఎక్కువ. 2 మిలియన్లు హ్యాకర్ అటెంప్ట్ లను వ్యాపార యజమానులను రక్షించినట్లు గూగుల్ తెలిపింది. ఇది 2022లో 1 మిలియన్ గా ఉంది.
అనుమానాస్పద యాక్టివిటీస్, దుర్వినియోగ ప్రయత్నాలను కంపెనీ సిస్టమ్ లు గుర్తించిన తర్వాత లక్షా 23వేల కంటే ఎక్కువ వ్యాపారాలపై తాత్కాలిక రక్షణ కల్పించినట్లు గూగుల్ పేర్కొంది. గతేడాది మ్యాప్స్ లో చిన్న వ్యాపారాలపై ఫేక్ రివ్యూస్ పోస్ట్ చేసిన నటుడిపై గూగుల్ దావా వేసింది.