గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెమిని 1.0కి అప్డేట్ వెర్షన్ ను తీసుకొచ్చింది. శుక్రవారం (డిసెంబర్13) జెమిని 2.0 ను లాంచ్ చేసింది. కొత్త వెర్షన్ Gemini 2.0 .. పాత వెర్షన్ కంటే రెండు రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది.
జెమిని 1.0 వెర్షన్ కేవలం సమాచారాన్ని తీసుకోవడం, అర్థం చేసుకోవడం మాత్రమే చేస్తుంది.. Gemini 2.0 మల్టీ మోడల్ రీజనింగ్, లాంగ్ కాంటెక్ట్స్ అండర్ స్టాండింగ్ ,కాంప్లెక్స్ ఇన్ స్ట్రక్షన్ ఫాలోయింగ్, ప్లానింగ్ , కంపోజిషనల్ ఫంక్షన్ కాలింగ్, లోక్ టూల్ వాడకం వంటి నిర్వహిస్తుందని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడిం చారు.
Gemini 2.0 లో కొత్తదనం ఏమిటంటే..
కొత్త వెర్షన్ Gemini 2.0 దాని ముందు వెర్షన ఖంటే రెండింతల వేగాన్ని అందిస్తుంది.. అంతేకాదు మల్టీ మోడల్ ప్రాసెసింగ్ లో ఉత్తమమైనది. టెక్ట్స్ , ఆడియో, వీడియో, ఇమేజ్ లతో సహా వివిధ డేటా రకాల అవుట్ పుట్ లను అందించగలదు. 1మిలియన్ టోకెన్ల కంటెక్ట్స్ విండోను నిర్వహించడం దీని ప్రత్యేకత.
Gemini 2.0 పవర్ ఫుల్ మోడల్ తో నిర్మించబడింది.ఇది AI టెక్నాలజీలో మెరుగైన పనితీరును అందిస్తుంది. ఇది ఎటువంటి సాయం లేకుండా స్వంతంగా పనిచేస్తుంది. క్లిష్టపమైన సమస్యలకు చురుకైన తెలివైన పరిష్కారాలను అందిస్తుందని గూగుల్ చెబుతోంది.
ALSO READ : నవంబర్‌లో దిగొచ్చిన ఇన్‌ఫ్లేషన్ .. 5.48 శాతానికి డౌన్
Gemini 2.0లో అల్ట్రా, ప్రో, నానో తోపాటు ఫ్లాష్ మోడల్ కూడా ఉంటుంది. ఇమేజింగ్, ఆడియో ప్రాసెసింగ్ లో ఇంప్రూవ్ మెంట్ తో Gemeni 2.0 వస్తుంది. జెమిని 2.0 లో Google AI Agent కూడా ఒక భాగం.ఇది వెబ్ బ్రౌజర్.. క్రోమ్ ను ఉపయోగించడం ద్వారా టాస్క్ లలో సహాయపడుతుంది. ఈ AI ఏజెంట్ అనేది ప్రొజెక్ట్ ఆస్ట్రాలో భాగంగా స్మార్ట్ గ్లాస్ లలో కూడా తన ఉనికిని చాటుకుంటుంది. ఈ గ్లాసెస్ జెమిని 2.0 నుంచిAI పవర్ ను పొందుతాయి. మ్యాప్స్, లెన్స్ తో అనుసంధానించ బడతాయి.