
Google Search Domain: ప్రస్తుతం గూగుల్ తన సెర్చ్ ప్లాట్ ఫారమ్ విషయంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. టెక్ దిగ్గజం అందించిన తాజా సమాచారం ప్రకారం ఇకపై దేశం ఆధారిత కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమెయిన్స్ అందుబాటులో ఉండవని కంపెనీ పేర్కొంది.
అంటే ఉదాహరణకు యూజర్లు తమ సెర్చ్ కోసం Google.co.in వినియోగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వాస్తవానికి గూగుల్ వీటిని స్థానిక సెర్చ్ రిజల్ట్స్ అందించటం కోసం తొలినాళ్లలో ప్రవేశపెట్టింది. అయితే అనేక ఏళ్ల ప్రయాణం తర్వాత యూజర్లకు తమ స్థానికతకు అనుగుణంగా అక్కడి సమాచారాన్ని అందించటంలో టెక్నాలజీని భారీగా గూగుల్ పెంచిన సంగతి తెలిసిందే. అందువల్ల ఇకపై దేశం ఆధారిత సెర్చ్ డొమెన్స్ వాడటం అనవసరంగా పేర్కొంది. అందువల్ల ఏప్రిల్ 15 నుంచి ఈ సెర్చ్ డొమెయిన్స్ ట్రాఫిక్ క్రమబద్ధీకరించబడుతుందని గూగుల్ పేర్కొంది.
Also Read:-రూ.5 లక్షలను రూ.కోటిగా మార్చే మార్గం.. ఎంత కాలం పడుతుంది..?
స్థానిక ఫలితాలను పొందటం కోసం యూజర్ల అనుభవాన్ని మెరుగుపరిచే క్రమంలో గూగుల్ ఈ దేశం ఆధారిత సెర్చ్ డొమెయిన్లను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం వీటి అవసరం లేదనందున.. దశలవారీగా రానున్న కొన్ని నెలల్లో తాజాగా ప్రతిపాదించిన మార్పులను అమలులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో కొందరు యూజర్లు మార్పులో భాగంగా తమ సెర్చ్ ప్రిఫరెన్సెస్ అందించాల్సి ఉంటుందని గూగుల్ వెల్లడించింది. అయితే తాజా మార్పుల వల్ల యూజర్లకు ఎలాంటి ఇబ్బంది కలగదని, ఇవి పూర్తిగా జాతీయ చట్టాలకు అనుగుణంగా చేపడుతున్న మార్పులుగా కంపెనీ వెల్లడించింది.