కరోనాపై పోరుకు సుందర్ పిచాయ్ రూ.5 కోట్ల  విరాళం

కరోనాపై పోరుకు సుందర్ పిచాయ్ రూ.5 కోట్ల  విరాళం

కరోనాపై పోరాడేందుకు తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నాయి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు. వినిమయ డిమాండ్‌ పూర్తిగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థలు మరింత మాంద్యంలోకి కూరుకుపోతున్నాయి. ఇలాంటి సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ మరోసారి తన వంతు సాయం అందించారు. గివ్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.5 కోట్లు విరాళంగా ఇవ్వను న్నారు. భారతదేశం లాక్‌డౌన్‌ ఇబ్బందుల్లో ఉన్నా రోజువారీ వేతన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి రూ.5 కోట్ల నిధులను అందించనుంది. ఈ సందర్భంగా గివ్‌ ఇండియా …ట్విట్టర్‌ ద్వారా సుందర్‌ పిచాయ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.