
ఐపీఎల్.. ఎన్నో అద్భుతాలు.. అవార్డులు.. రికార్డులు.. ఈ ఈవెంట్ కు సొంతం. టెస్ట్, వండే క్రికెట్ సరళిని మార్చేంతలా ప్రభావితం చేసిన ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. దేశం తరఫున ఆడే అఫీషియల్ టీమ్ లో ఆడకపోయినా.. ఈ పొట్టి క్రికెట్లో ఛాన్స్ లు కొట్టేసి ఎందరో స్టార్లుగా ఎదుగుతున్నారు. లేటెస్ట్ గా 14 ఏళ్ల కుర్రోడు ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసి అందరినీ ఆకర్శించాడు. శనివారం (ఏప్రిల్ 19) లక్నోతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ తరఫున గ్రౌండ్ లోకి దిగిన కుర్రోడు వైభవ్ సూర్యవంశీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాడు.
తొలి మ్యాచ్ లోనే 20 బాల్స్ లో 34 రన్స్ చేసి వాహ్వా.. అనిపించాడు. అది కూడా ఫస్ట్ బాల్ నే సిక్సర్ గా మలచిన తీరుకు, అతని డేరింగ్ కు చాలా మంది ఫిదా అయ్యారు. గూగుల్ సీఈఓ సందర్ పిచాయ్ కూడా ఈ 8వ తరగతి చదువుతున్న ప్లేయర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వైభవ్ ఆటకు ఫిదా అయిన పిచాయ్.. ‘‘సూర్యవంశీ ఆట చూసేందుకే ప్రత్యేకంగా నిద్ర లేచాను. అతని లైవ్ యాక్షన్ చూసేందుకు ఎదురు చూశా.. వాట్ ఎ డెబ్యూట్’’నని ట్వీట్ చేశాడు. దీంతో ఈ 14 ఏళ్ల కుర్రోడు మరింత ట్రెండింగ్ లోకి వచ్చాడు.
𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡
— IndianPremierLeague (@IPL) April 19, 2025
Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝
Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q
RR vs LSG మ్యాచ్ లో లక్నో ఇచ్చిన 181 రన్స్ టార్గెట్ లో సంజూ శాంసన్ ఇంజూర్ అవ్వడంతో అతని స్థానంలో సూర్యవంశీ ఎంట్రీ ఇచ్చాడు. యశస్వీ జైశ్వాల్ తో కలిసి 85 పరుగుల పాట్నర్షిప్ క్రియేట్ చేశాడు. మార్కరమ్ బౌలింగ్ లో రిషబ్ పంత్ స్టంప్ చేయడంతో ఔట్ గా వెనుదిరిగాడు. కానీ.. కాన్ఫిడెంట్ గా అతడు బ్యాటింగ్ చేసిన విధానం జైపూర్ స్టేడియంలోని ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంది. దీనిపై సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. సూర్యవంశీ పేరెంట్స్ కు అతడి తొలిరోజు ఆట ఒక ప్రౌడ్ ముమెంట్ గా నిలుస్తుందని కొనియాడాడు.
►ALSO READ | IPL Tickets: ఐపీఎల్ టికెట్లు కావాలా.. అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. సైబర్ నేరగాళ్ల నయా దోపిడీ
అయితే ఈ మ్యాచ్ లో యశశ్వీ జైస్వాల్ తో కలిసి 85 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు ఈ కుర్రోడు. అంత మంచి స్టాట్ ఇచ్చినా.. మిడిలార్డర్స్ ఆ కాన్ఫిడెన్స్ ను కొనసాగించలేకపోయారు. దీంతో రాజస్థాన్ ఓడిపోవాల్సి వచ్చింది.