మీరూ గూగుల్ సీఈవో అవ్వొచ్చు…

మీరూ గూగుల్ సీఈవో అవ్వొచ్చు…

ఆగండాగండి. నిజంగానే గూగుల్ సీఈవో అయిపోదామనుకుంటున్నారా ఏంటి? సీఈవోగా సుందర్ పిచాయ్ ఏం తప్పుకోలేదు. ఆయనింకా ఉన్నారు. కానీ, లింక్ డ్ ఇన్ లో జరిగిన ఓ చిన్న తప్పు కారణంగా, చాలా మందికి గూగుల్ సీఈవో పోస్టు ఆఫర్ వెళ్లింది. ఓ బగ్ వల్ల కంపెనీ అనుమతి లేకుండానే ఎవరైనా జాబ్ పోస్ట్​ చేసేలా యూజర్లకు అనుమతి దొరికింది. లింక్ డ్ ఇన్
లోని ఏ బిజినెస్ పేజీలోనైనా జాబ్ పోస్ట్​ చేసేలా లోపం తలెత్తింది. దీంతో సీఈవో ఆఫర్ వెళ్లిపోయింది. చాలా మంది గూగుల్ సెర్చ్​ ఇంజన్ లో సీఈవో జాబ్ గురించి చాలా మంది వెతికారు. ఈ విషయాన్ని లింక్ డ్ ఇన్ ధ్రువీకరించింది. అయితే, లోపాన్ని సరిచేశామని, ఇకపై అలాంటి తప్పులేవీ జరగవని పేర్కొంది.

‘‘మా పోర్టల్ లో బగ్ వల్ల జాబ్ పోస్ట్​ చేశాక యూజర్లు కంపెనీని ఎడిట్ చేసే అవకాశం కలిగింది. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు మా కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధం ” అని ప్రకటించింది. ఘటన గురించి తెలిసిన వెంటనే దానిని సరిచేశామని తెలిపింది. ఓ కంపెనీ తరఫున మరో కంపెనీ జాబ్ లను పోస్ట్​ చేయడానికి అనుమతి ఉన్నా , దానికి వేరే పార్టీ వాళ్ల అనుమతి కూడా తప్పనిసరి అని చెప్పింది. చిన్న, మధ్యస్తమైన కంపెనీలు జాబ్ లను ఫ్రీగా పోస్ట్​ చేసేలా ఫ్రీ ట్రయల్స్ చేస్తున్నా మని, ఇప్పుడు గూగుల్ సీఈవో పోస్టును చేసిన కంపెనీ అందులో ఒ కటే నని పేర్కొంది. కాగా, మొట్టమొదటగా ఈ సమస్యను నెదర్లాండ్స్ కు చెందినమిషెల్ రైండర్స్ అనే రిక్రూటర్ గుర్తించారట. వెంటనే ఆ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లారాయన. దీంతో సమస్యేం టో లింక్‌‌డ్‌‌ఇన్‌‌ గుర్తించి దానిని పరిష్కరించింది.