టెక్నాలజీ : ఏఐతో స్టోర్ రివ్యూస్​.. గూగుల్ కొత్త ఫీచర్..

టెక్నాలజీ  : ఏఐతో స్టోర్ రివ్యూస్​.. గూగుల్ కొత్త ఫీచర్..


గూగుల్ క్రోమ్​లో ఒక టాపిక్ సెర్చ్​ చేస్తే దానికి సంబంధించి అనేక వెబ్​సైట్​​లు కనిపిస్తాయి. అయితే అందులో అసలైనదేదో, నకిలీది ఏదో కనిపెట్టడం కష్టం. అందువల్లే చాలామంది యూజర్లు రకరకాల సైబర్​ మోసాలకు గురవుతున్నారు కూడా. అయితే, ఇప్పుడు ఈ ప్రాబ్లెమ్​కి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్​ తీసుకురానుంది. అదే స్టోర్ రివ్యూస్​. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో పనిచేస్తుంది. ఎలాగంటే... ఏఐ ద్వారా ట్రస్ట్​ పైలట్​, స్కామ్ అడ్వైజర్​ వంటి ఇండిపెండెంట్ ప్లాట్​ఫాంల నుంచి యూజర్ల రివ్యూలను సేకరిస్తుంది. దాంతో వెబ్​సైట్​ విజిట్ చేసినవాళ్లకు దాని గురించి సమాచారం అందిస్తుంది.

క్రోమ్​లో ఒక వెబ్​సైట్ విజిట్​ చేసినప్పుడు అడ్రెస్ బార్​లో ఐ అనే ఐకాన్​ మీద క్లిక్ చేయడం ద్వారా సైట్​ ఇన్​ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఐకాన్​కి బదులు స్టోర్ రివ్యూస్​ అనే టైటిల్ రాబోతుంది. దానిమీద క్లిక్ చేయగానే ఏఐ– జనరేట్ చేసిన రివ్యూల సారాంశం కనిపిస్తుంది. ఇంతకుముందు ఒక వెబ్​సైట్ గురించి తెలుసుకోవాలంటే ఎన్నో రివ్యూలు చూడాల్సి వచ్చేది.

కానీ, స్టోర్ రివ్యూస్ ఫీచర్​ అందుబాటులోకి వస్తే అన్ని రివ్యూలు చూడాల్సిన పనిలేదు. వెబ్​సైట్​ రియల్​ లేదా ఫేక్​ అనేది వెంటనే తెలిసిపోతుంది. ఈ ఫీచర్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది.