అలర్ట్ అలర్ట్.. గూగుల్‌ క్రోమ్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి..లేదంటే

అలర్ట్ అలర్ట్.. గూగుల్‌ క్రోమ్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి..లేదంటే

 గూగుల్‌ క్రోమ్‌ను వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సెర్చ్ ఇంజన్ గూగుల్ క్రోమ్ ను వెంటనే అప్ డేట్ చేసుకోవాలని  యూజర్లను హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ లోని  కొన్ని వెర్షన్లకు ఫిషింగ్‌, డాటా దాడులు, మాల్‌వేర్‌ ఇన్‌ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉన్నదని వెల్లడించింది. ప్రాంప్ట్స్‌, వెబ్‌ పేమెంట్స్‌ ఏపీఐ, వీడియో, వెబ్‌ ఆర్‌టీసీ ఫీచర్లకు ప్రమాదం కలగవచ్చని సూచించింది.   గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న వారు తక్షణమే అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్  యూజర్లను అప్రమత్తం చేసింది. గూగుల్ క్రోమ్ 115.0.5790.170 (ఆపిల్/లినక్స్), 115.0.5790.170/.171 (విండోస్) వెర్షన్ల కంటే ముందు వెర్షన్ వాడుతున్నవారు తక్షణమే అప్ డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

గూగుల్ క్రోమ్‌ను ఎలా అప్‌డేట్‌ చేయాలంటే

  • గూగుల్‌ క్రోమ్‌ ఓపెన్‌ చేయాలి.
  • విండో రైట్ సైడ్ పైన భాగంలో ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయాలి.
  • Help > Google Chrome గురించి ఎంచుకోండి.
  • అప్‌డేట్ అందుబాటులో ఉంటే , Chrome దాన్ని ఆటోమెటిక్ గా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంది.
  • ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, Chrome రీ స్టార్ట్ అవుతుంది. 

 అప్‌డేట్‌ల కోసం మాన్యువల్‌గా కూడా చెక్ చేసుకోవచ్చు. 

  • Google Chrome ఓపెన్ చేయండి.
  • విండో రైట్ సైడ్ పై భాగంలో మూడు చుక్కలను క్లిక్ చేయండి.
  • Help > Google Chromeను సెలక్ట్ చేయండి.
  • అప్‌డేట్ల కోసం సెర్చ్‌ను క్లిక్ చేయండి.

సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేయడమే కాకుండా ఈ ఆన్‌లైన్‌ సమస్యల నుంచి వస్తువులను రక్షించడానికి అనుసరించాల్సిన కొన్ని అదనపు భద్రతా చర్యలు..

  • ఎదైనా వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేస్తే .. క్లిక్ చేసే లింక్‌ల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆ  వెబ్‌సైట్ సురక్షితంగా ఉందో లేదో తెలియకపోతే, వెంటనే సైట్ నుంచి బయటకు రండి..
  • ఆన్‌లైన్ ఖాతాలన్నింటికీ పవర్ ఫుల్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి. 
  • ఆన్‌లైన్ ఖాతాలన్నింటికీ 2-పాయింట్ వెరిఫికేషన్‌ను సెట్ చేసుకోండి.
  • ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో వ్యక్తిగత  సమాచారాన్ని షేర్ చేసుకోవద్దు.
  • తాజా భద్రతా ప్యాచ్‌లతో ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండండి..
  • మాల్వేర్ నుంచి కంప్యూటర్‌ను రక్షించడానికి ఫైర్‌వాల్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి.