జీ మెయిల్.. ఇది లేనిదే పని జరగదు.. మీ ఫోనైనా.. మీ యాపైనా .. మీరు ఆన్ లైన్ లో ఉపయోగించే ఏ సేవైనా.. జీ మెయిల్ మస్ట్.. జీ మెయిల్ ఐడీ లేకపోతే ఏ పనీ జరగదు.. ప్రతిదానికీ దీనితో లింక్ ఉంటుంది.. అంతెందుకు ప్రతి వ్యాపార సంస్థ ఆన్ లైన్ కోసం కచ్చితంగా ఓ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. అలాంటి జీ మెయిల్ షట్ డౌన్ అవుతుందట. 2024 ఆగస్ట్ 1వ తేదీ నుంచి జీ మెయిల్ పని చేయదు అనే ప్రచారం ఎక్స్.. (ట్విట్టర్)లో ట్రెండ్ అవుతుంది. ఇందులో నిజం ఎంత.. దీనిపై జీ మెయిల్ ఏమని స్పందించింది.. అసలు జీ మెయిల్ షట్ డౌన్ వార్త ఎందుకు ట్రెండింగ్ అవుతుంది అనేది తెలుసుకుందాం..
ప్రముఖ మెయిలింగ్ సర్వీస్ జీమెయిల్ ను గూగుల్ సంస్థ ఈ ఏడాది మూసేయనుందని గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై గూగుల్ క్లారిటీ ఇచ్చింది. జీమెయిల్ ను ఆపేయట్లేదని, దాని బేసిక్ HTML వర్షన్ ని మాత్రమే నిలిపివేస్తున్నామని, జీమెయిల్ యధాతధంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. వస్తున్న పుకార్లలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. జీమెయల్ నిలిపివేత పుకార్లను నమ్మి టెన్షన్ పడుతున్న వినియోగదారులకు గూగుల్ నుండి వచ్చిన క్లారిటీ ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి.
Gmail is here to stay.
— Gmail (@gmail) February 22, 2024
ఇంతవరకూ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేకపోయినా బేసిక్ HTML వర్షన్లో మెయిల్స్ ని చూసుకునే వెసలుబాటు ఉండేది. తాజాగా గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఇక మీదట బేసిక్ వర్షన్ కనుమరుగవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా అధికశాతం మంది వాడే మెయిలింగ్ యాప్ జీమెయిల్, మొత్తానికి ఈ సర్వీస్ ఆగిపోతుందంటూ వచ్చిన వార్తలు నిజం కాదని తేలటంతో యూజర్ల టెన్షన్ కి తెర పడింది.