గూగుల్‌ మరో సంచలనం సృష్టించింది

గూగుల్‌ మరో సంచలనం సృష్టించింది

గూగుల్‌ సంస్థ  మరో సరికొత్త చరిత్రను సృష్టించింది. క్యాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో సూపర్‌ కంప్యూటర్లను మించిన వేగంతో పని చేసే లేటెస్ట్ సికమోర్‌ చిప్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ 10 వేల ఏళ్లలో పూర్తి చేసే లెక్కను ఈ క్యాంటమ్‌ కంప్యూటింగ్‌ చిప్‌ కేవలం 200 సెకన్లలో పూర్తిచేసినట్లు గూగుల్‌ తెలిపింది. తాజా ఆవిష్కరణను క్యాంటమ్‌ సుప్రిమసీ గా అభివర్ణించింది. సాధారణ కంప్యూటర్లు బైనరీ సంఖ్యల ఆధారంగా డేటా ప్రక్రియలను నిర్వహిస్తాయి. సికమోర్‌ చిప్‌ బైనరీ సంఖ్యలతో పాటు 54 క్యూబిట్స్‌తో కూడిన క్యాంటమ్‌ ప్రాసెసర్‌ ఆధారంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిప్‌లో ప్రతి క్యూబిట్‌ మరో నాలుగు క్యూబిట్‌లతో లింకై ఉంటుంది. ఫలితంగా లెక్కించే ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతుందని గూగుల్‌ శాస్త్రవేత్త తెలిపారు.