- పీడీఎఫ్ ఫైల్స్, ఆఫీస్ ఫైల్స్, ఫోటోలు చూసుకునే అవకాశం
గూగుల్ డ్రైవ్ ఇప్పుడు ఆఫ్ లైన్ మోడ్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆఫీస్ ఫైల్స్, ఫొటోలు, పీడీఎఫ్ డాక్యుమెంట్లను సాధారణంగా గూగుల్ డ్రైవ్లో దాచుకోవడం చాలా మందికి అలవాటు. అయితే వాటిని మళ్లీ చూసుకోవాలంటే ఇప్పటి వరకు ఇంటర్నెట్ కచ్చితంగా ఉండాలి. అయితే ఇకపై ఆ అవసరం లేదు. ఇపుడు ఆఫ్లైన్లో కూడా వీటిని తీసి చూసుకునే అవకాశం అందుబాటులోకి తెచ్చింది గూగుల్. ఈ ఆప్షన్ ఉపయోగించుకోవాలంటే ముందే మనం ఓకే అని టిక్ చేయాల్సి ఉంటుంది.
డెస్క్ టాప్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఓకే చెబితే చాలు. ఇంటర్నెట్కి కనెక్ట్ చేయకపోయినా బ్రౌజర్ని ఉపయోగించి ఫైల్లను తెరవడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది. 2019 నుంచి ఈ ఫీచర్ ను పరీక్షించిన గూగుల్ తాజాగా వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చింది. సో... గూగుల్ డ్రైవ్లో దాచుకున్న ఫైల్స్ చూడాలంటే మునుపటిలాగా ఇంటర్నెట్ తప్పనిసరి కాదు.