
స్మార్ట్ ఫోన్ యూజర్ల సేఫ్టీ కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటంటే.. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ మూడు రోజులపాటు లాక్ అయిపోతే, దానంతటదే రీస్టార్ట్ అవుతుంది. ఈ ఫీచర్‌ని గూగుల్ ప్లే సర్వీస్ లేటెస్ట్ వెర్షన్ 25.14లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో అనధికారిక యాక్సెస్‌ను అడ్డుకోవచ్చు.
ఫోన్ రీస్టార్ట్ అయ్యాక అన్‌లాక్ చేయడానికి పాస్వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే రీస్టార్ట్ అయిన తర్వాత ఫింగర్ ప్రింట్ లేదా అన్‌లాక్ ఫీచర్లు పనిచేయవు. పాస్ వర్డ్, పిన్ వంటివి ఎంటర్ చేస్తేనే అన్‌లాక్ అవుతుంది. ఇది ట్యాబ్లెట్ వాడేవాళ్లకు, అలాగే రెండు ఫోన్లు వాడేవాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.
►ALSO READ | యూట్యూబ్ వీడియోకు కాపీరైట్ స్ట్రైక్ పడకుండా.. ఏఐ బేస్డ్ మ్యూజిక్ జనరేటర్ టూల్