
గూగుల్ తన AI చాట్‌బాట్ జెమినిలో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ఫోటోలను అనుసంధానించడం ద్వారా ఆండ్రాయిడ్ కస్టమర్లకు శక్తివంతమైన కొత్త ఫీచర్‌ను అందిస్తుంది. ప్రారంభంలో గూగుల్ I/O "ఆస్క్ ఫోటోలు" బ్యానర్ కింద ప్రకటించిన ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. ఈ అప్డేట్ జెమిని కస్టమర్ల ఫోటో లైబ్రరీలను స్కాన్ చేసి కావాల్సిన ఫొటోలను గుర్తించడం, కంప్యూటర్ విజన్ ఉపయోగించి వాటి నుంచి వివరాలను సేకరించేందుకు అనుమతిస్తుంది.
Also Read :- నెలక్రితం లాంచ్..బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై రూ.5వేల డిస్కౌంట్
ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలంటే..
- ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు జెమిని యాప్ ను ఓపెన్ చేయాలి.
- ఎగువ కుడి మూలలో ఉన్న ప్రొఫైల్ సింబల్ పై క్లిక్ చేయాలి.
- యాప్‌ల మెనుకి ఎక్స్ టెన్షన్ ను క్లిక్ చేసి Google Photos సెలెక్ట్ చేసుకోవాలి.
- ఒకసారి ప్రారంభించిన తర్వాత స్మార్ట్ ఇమేజ్ సెర్చింగ్ చేస్తున్నప్పుడు జెమిని మీ ఫోటో లైబ్రరీకి యాక్సెస్ పొందుతుంది.
- ఫొటోలను ఎలా పొందవచ్చు?
- మీకు కావాల్సిన ఫొటోలు వెతకాలంటే.. ఉదాహరణకు గత సంవత్సరం నుంచి నా గోవా ట్రిప్ ఫొటోలనున చూపించు అని టైప్ చేయాలి. అపుడు జెమిని వాటిని పిక్ చేస్తుంది. కంటెంట్‌ను విశ్లేషించి తదనుగుణంగా సమాధానం ఇవ్వడానికి జెమిని AIని ఉపయోగిస్తుంది.