ఏ సాయం కావాలన్నా జెమినిని అడగొచ్చు!

ఏ సాయం  కావాలన్నా జెమినిని అడగొచ్చు!

ఉదయ్​ ఒకసారి బిజినెస్​ పనిమీద ఫారిన్​ వెళ్లాడు. అక్కడి రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌లో భోజనం చేస్తున్నప్పుడు పక్క టేబుల్​ మీద ఒక కొత్త వంటకాన్ని చూశాడు. దాని గురించి అడిగి తెలుసుకుందామంటే అతనికి అక్కడి భాష తెలియదు. వెంటనే ఫోన్​లో కెమెరా ఆన్​ చేసి.. ‘జెమిని’(ఏఐ)ని ‘‘ఇదేంటి?” అని అడిగాడు. జెమిని ఆ వంటకం వివరాలన్నీ తన మాతృభాషలోనే చెప్పింది. ఫుడ్​ గురించే కాదు.. జెమినిలో దేని గురించైనా తెలుసుకోవచ్చు. మరో మనిషితో మాట్లాడుతున్నట్టే ఏఐతో మాట్లాడొచ్చు. సమస్యలకు పరిష్కారాలే కాదు.. సలహాలు, అభిప్రాయాలు కూడా అడగొచ్చు. 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ప్రతి ఒక్కరూ పరోక్షంగా లేదంటే ప్రత్యక్షంగా రోజూ వాడుతూనే ఉన్నారు. అందుకే గూగుల్​, మెటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పోటీపడి మరి ఏఐలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటి ద్వారా యూజర్లకు మరింత మెరుగైన ఎక్స్​పీరియెన్స్​  అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలోనే గూగుల్ జెమిని లైవ్ ‘రియల్​ టైం ఏఐ’ ఫీచర్​ని తీసుకొచ్చింది. దీన్ని గూగుల్​ గతంలోనే ప్రకటించినా ఈ మధ్యే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కాకపోతే.. ప్రస్తుతం పిక్సెల్​ 9, శామ్‌‌‌‌‌‌‌‌సంగ్​ గెలాక్సీ ఎస్​ 25.. లాంటి కొన్ని ఫోన్లలో మాత్రమే ఫ్రీగా పనిచేస్తుంది. 

ఇంటరాక్టివ్ ఫీచర్

జెమిని లైవ్ అనేది గూగుల్ జెమిని అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లోని ఒక ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ ఫీచర్. మీరు చూస్తున్న వస్తువుని ఫోన్​  కెమెరా ద్వారా చూపించి.. దాని గురించి నేరుగా జెమినితో మాట్లాడొచ్చు. అది మీకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ అడిగినా వెంటనే చెప్పేస్తుంది. ఇది తెలుగు సహా అనేక భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. ప్రశ్న అడిగిన భాషలోనే సమాధానాలు కూడా ఇస్తోంది. ఇది వాయిస్​ని మాత్రమే కాదు..  వీడియోలు, పీడీఎఫ్​లు, ఫొటోలు, టెక్స్ట్... ఇలా అన్నింటినీ అర్థం చేసుకోగలదు. 

ఎలా పనిచేస్తుంది?

ఇది రియల్- టైంలో యూజర్లతో నేచురల్​గా అంటే ఒక మనిషిలా మాట్లాడగలదు. పాత వాయిస్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌లకు భిన్నంగా ఉంటుంది. ప్రశ్నలను వెంటనే అర్థం చేసుకుని, సందర్భానుసారంగా సమాధానాలు ఇస్తుంది. మధ్యలో అడ్డుకున్నా స్పందిస్తుంది. అంటే జెమిని చెప్తున్న ఇన్ఫర్మేషన్​లో ఏదైనా డౌట్​ ఉంటే మధ్యలోనే అడగొచ్చు. అది ఆ డౌట్​ని క్లియర్​ చేసి.. మళ్లీ అసలు విషయంలోకి వెళ్తుంది. ఫోన్ కెమెరాని ఆన్​ చేసి చుట్టూ ఉన్న వస్తువులను చూపిస్తే.. రియల్-టైమ్ కెమెరా ఇంటరాక్షన్​  ద్వారా వాటిని గుర్తించి, పూర్తి సమాచారం అందిస్తుంది. 

ఉదాహరణకు, ఒక పండును చూపించి, ‘‘ఇది ఏమిటి?’’ అని అడిగితే, జెమిని దాని పేరు, ఉపయోగాలను వివరిస్తుంది. మీ దగ్గర ఉన్న ఒక పాత బ్యాగ్​ని చూపించి ‘‘ఇలాంటి బ్యాగ్​ మరొకటి కొనాలి అనుకుంటున్నా. ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగితే.. అది ఏ స్టోర్​లో దొరుకుతుంది? దాని ధర ఎంత? అనే పూర్తి వివరాలు చెప్తుంది. అంతేకాదు.. ‘ఇప్పుడు.. ఈ ధరకు దీన్ని కొనొచ్చా? లేదంటే ఇంకేమైనా బెస్ట్‌‌‌‌‌‌‌‌ మోడల్స్​ అందుబాటులో ఉన్నాయా?’.. అనడిగితే దాని అభిప్రాయాన్ని కూడా చెప్తుంది. 

సాయం చేస్తుంది

ఏదైనా గాడ్జెట్​ని చూపించి అందులో తలెత్తిన సమస్య గురించి చెప్తే.. దానికి కారణాలు చెప్పడంతోపాటు ఎలా పరిష్కరించాలో వివరిస్తుంది. కొన్ని గాడ్జెట్స్​లో సమస్యను త్వరగా అంచనా వేయడంతోపాటు ట్రబుల్​షూటింగ్ స్టెప్స్​ని కూడా సూచిస్తుంది. 

కలిసి షాపింగ్ చేయొచ్చు

ఈ కామర్స్​ అందుబాటులోకి వచ్చాక.. షాపింగ్ చేయడం చాలా ఈజీ అయ్యింది. జెమిని లైవ్​తో అది మరింత సులభమయ్యింది. స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్​ చేసి వస్తువులను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏఐని సాయం అడగొచ్చు. ఏదైనా వస్తువుని చూపించి ఇంకేదైనా వెబ్​సైట్​లో దీని ధర తక్కువగా ఉందా? అని అడిగితే వెంటనే సమాధానం ఇస్తుంది. దీనివల్ల టైం ఆదా కావడంతోపాటు డబ్బు సేవ్​ చేసుకోవచ్చు. అంతేకాదు.. వార్డ్‌‌‌‌‌‌‌‌రోబ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఒక షర్ట్‌‌‌‌‌‌‌‌ని చూపించి దానికి సరిపోయే ఒక ప్యాంట్‌‌‌‌‌‌‌‌ని సిఫార్సు చేయమని అడిగినా ఏఐ సాయం చేస్తుంది. 

సలహాలు ఇస్తుంది 

ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులను చక్కబెట్టడానికి కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. అలాంటప్పుడు జెమిని లైవ్‌‌‌‌‌‌‌‌ సాయం చేస్తుంది. అంటే ఏది ఎక్కడ పెడితే బాగుంటుందో చెప్తుంది. ఫోన్ కెమెరాకు అస్తవ్యస్తంగా ఉన్న షెల్ఫ్​ని చూపించి ఎలా సర్దాలో అడిగితే చిట్కాలు ఇస్తుంది.

స్క్రీన్ షేరింగ్ 

ఫోన్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ను షేర్ చేసి దానిపై ఉన్న కంటెంట్ గురించి కూడా ప్రశ్నలు అడగొచ్చు. ఉదాహరణకు, యూట్యూబ్​లో వంట చేస్తున్న వీడియో చూస్తూ.. అందులో వాడిన ఇంగ్రెడియెంట్స్​​ ఏంటి? అని అడిగితే.. లిస్ట్‌‌‌‌‌‌‌‌ రాసి చూపిస్తుంది. ఆ లిస్ట్‌‌‌‌‌‌‌‌ని వర్డ్‌‌‌‌‌‌‌‌ ఫైల్​లా సేవ్​ చేయమంటే గూగుల్​ డాక్స్​లో సేవ్​ చేసి పెడుతుంది.