Automated password change: సైబర్ సేఫ్టీకోసం గూగుల్ కొత్త ఫీచర్

Automated password change: సైబర్ సేఫ్టీకోసం గూగుల్ కొత్త ఫీచర్

సైబర్ నేరాల నుంచి తప్పించుకోవాలంటే ఎప్పటికప్పుడు అలెర్ట్​గా ఉండాలి. ఆయా కంపెనీలు కూడా సైబర్ సెక్యూరిటీని అందించడంలో ప్రయత్నాలు చేస్తున్నా యి. అందులో భాగంగానే గూగుల్ కంపెనీ సైబర్ సేఫ్టీ కోసం కొత్త ఫీచర్​ తీసుకురానుంది. అందుకు ఏఐ సాయం తీసుకుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే.. ఆటోమేటెడ్ పాస్​వర్డ్​ ఛేంజ్. ఈ ఫీచర్ పాస్​వర్డ్​లను ఆటోమెటిక్​గా మార్చుకోగలదు. దీంతో యూజర్ల డేటాసురక్షితంగా ఉంటుంది.

గూగుల్ క్రోమ్​లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ వస్తే పాస్​వర్డ్ లీక్ అయిందని గూగుల్ క్రోమ్ గుర్తించిన వెంటనే ఏఐ సాయంతో ఆటోమెటిక్​గా మార్చే స్తుంది. పాస్​వర్డ్ మారిన తర్వాత దాన్ని గూగుల్ పాస్​వర్డ్ మేనేజర్​కు జోడిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్​ దశలో ఉంది.