భారతీయ వినియోగదారులు ఎక్కువగా సెర్చ్(శోధించిన) చేసిన పదాల లిస్ట్ గూగుల్ విడుదల చేసింది. షారూఖ్ ఖాన్ నటించిన జవాన్, మహిళల ప్రపంచకప్ వంటి కీలక పదాలతో పాటు చంద్రయాన్ 3, ChatGPT ని కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు.
2023లో ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలను గూగుల్ షేర్ చేసింది. ఇందులో భారత్ లో గూగుల్ సెర్చింగ్ లో చంద్రయాన్ 3, Chat GPT లను అత్యధికంగా శోధించారు. చంద్రయాన్3 చారిత్రక విజయంపై దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సెర్చింగ్ చేశారని తెలిపింది. దీంతోపాటు G20 ప్రెసిడెన్సీ పై ఎక్కువగా సెర్చింగ్ చేశారని గూగుల్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు, యూనిఫాం సివిల్ కోడ్ వంటి అంశాలపై దేశ ప్రజలు ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేశారు. వీటితో పాటు టర్కీ భూకంపం, ఇజ్రాయెల్ వార్తలకు సంబంధించిన ప్రశ్నలు శోధించినట్లు గూగుల్ తెలిపింది.