గూగుల్.. పలు యాప్ లను గూగుల్ ప్లే నుంచి తొలగించింది. మొత్తం 10 ప్రముఖ యాప్ లను నిర్ధాక్షిణ్యంగా తొలగించింది.ఇప్పటి వరకు వార్నింగ్ లతో వచ్చిన గూగుల్ సంస్థ.. తాజాగా పది యాప్ తొలగిస్తూ.. ఓ పోస్ట్ విడుదల చేసింది. కంపెనీ విధానాలకు అనుగుణంగా లేవని.. అంటే ప్లే స్టోర్ ఫీజులను చెల్లించడం లేదని ఈ చర్యలు తీసుకుంది.
భారత్ లోని ప్లే స్టోర్ నుంచి Quack-Quack, ALT Balaji, Aha, Shaadi.com వంటి యాప్ లను Google తీసివేసింది.అదే రోజు సాయంత్రం Naukri.com, 99Acrers వంటి యాప్ లను తొలగించింది. ఇక ప్లే స్టోర్ నుంచి తీసేసే వాటిలో Kuku FM , Stage Truly Madly ఉన్నాయి.
Google ఎల్లప్పుడూ దాని Play Store విధానాలు, ఫీజులు నార్మల్ గా ఉన్నాయని.. అయితే ఈ 10 కంపెనీలతోనే సమస్య తలెత్తుందని ప్రకటించింది. ఇతర యాప్ స్టోర్లకు చెల్లిస్తు్న్నారు. కానీ గూగుల్ Play Stores కి చెల్లించడం లేదని తెలిపింది. దీంతో ఈ కంపెనీల యాప్ లపై చర్యలకు గూగుల్ సిద్ధమైంది.
గూగుల్ తన ఫీజులను 15 నుంచి 30 శాతం వరకు సవరించింది. భారత్ లో యాప్ లో కొనుగోలు ఎంపికలను కలిగి ఉన్న యాప్ లకు 11 నుంచి 26 శాతం చేసింది. ఈ 10 పేరులేని కంపెనీలు తమ డీల్ లో కొంత భాగాన్ని కూడా చెల్లించడం లేదని తెలుస్తోంది. గూగుల్ నిబంధనల ప్రకారం కంపెనీలు నడుచుకోకపోవడం వల్లే ఈ 10 యాప్ లపై గూగుల్ నిషేధం విధించింది.