న్యూఢిల్లీ: 2023–-24 ఆర్థిక సంవత్సరంలో గూగుల్ ఇండియా పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ. 1,424.9 కోట్లుగా ఉందని టోఫ్లర్తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,342.5 కోట్ల లాభాన్ని సాధించింది. గూగుల్గత ఆర్థిక సంవత్సరంలో రూ. 7,097.5 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో కొనసాగుతున్న కార్యకలాపాల ద్వారా రూ. 5,921.1 కోట్లు, నిలిపివేసిన కార్యకలాపాల ద్వారా రూ. 1,176.4 కోట్లు వచ్చాయి.
2020–-2021 సమయంలో, గూగుల్ఐటీ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కంపెనీ ఐటీ వ్యాపార సంస్థను విభజించడానికి గూగుల్ ఇండియా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు ఒక దరఖాస్తును దాఖలు చేసింది. తదనంతరం ట్రిబ్యునల్ దీనిని ఆనుమతించింది. దీంతో గూగుల్ ఇండియా ఐటీ వ్యాపార సంస్థలు ఏప్రిల్ 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా గూగుల్ఐటీ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ అయ్యాయి.