ఇప్పటివరకు వెబ్‌సైట్స్ డొమైన్స్ అన్నీ డాట్‌కామ్, డాట్‌నెట్, డాట్‌ఇన్ మాత్రమే కనిపించేవి. కానీ, ఇకపై ఈ డొమైన్స్ మారబోతున్నాయి. వెబ్‌సైట్లకు కొత్త డొమైన్‌ను రూపొందిస్తున్నట్లు సెర్చింజన్ గూగుల్ తెలిపింది. ‘డాట్‌న్యూ’ పేరుతో టాప్ లెవెల్ డొమైన్ (టీఎల్‌డీ)ను ఈ వారంలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ తెలిపింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇతర సర్వీస్ కంపెనీలు డాట్ న్యూ పేరుతో కొత్త డొమైన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించింది. ఇవి ఇప్పటికే ఉన్న వెబ్‌సైట్స్, యాప్స్‌తో కలిసి పని చేస్తాయని చెప్పింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ ‘వర్డ్.న్యూ’ అని, స్పోటిఫై సంస్థ ‘ప్లేలిస్ట్.న్యూ’ అని రిజిస్టర్ చేసుకున్నాయి. వీటితోపాటు ఈబే, సిస్కో వంటి సంస్థలు కూడా కొత్త డొమైన్‌తో రిజిస్టర్ అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి కొత్త డొమైన్స్ అందుబాటులోకి వస్తాయి.