వార్తా కథనాలు రాయడంలో జర్నలిస్టులకు సహాయకుడిగా గూగుల్ ఓ కొత్త (AI ) టూల్ని అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం జెనెసిస్ అనే AI టూల్ ను పరిశీలిస్తున్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది. జెనెసిస్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రముఖ మీడియా సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వార్తా కథనాలను రాయడంలో జర్నలిస్టులకు సహాయం చేయడం లక్ష్యంగా గూగుల్ తెలిపింది.
సీనియర్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లకు ఎగ్జిబిషన్ సందర్భంగా వాస్తవాల ఆధారంగా సరైన కథనాలను రూపొందించగల 'జెనెసిస్' సామర్థ్యాలను Google ప్రదర్శించింది. వాషింగ్టన్ పోస్ట్, న్యూస్ కార్ప్ (వాల్ స్ట్రీట్ జర్నల్ యజమాని) , ది న్యూయార్క్ టైమ్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. అయితే దీనిపై మీడియా ప్రతినిధులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొంతమంది మీడియా ఎగ్జిక్యూటివ్‌లు ఖచ్చితమైన, నాణ్యత గల వార్తా కథనాలు రూపొందించడం సాధ్యం కాదని అన్నారు. వార్తలు రాయడం, హెడ్ లైన్ సూచనలకు దీనికి వినియోగించవచ్చని మరికొందరు మీడియా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
జర్నలిస్టులకు ముఖ్యంగా చిన్న పబ్లిషర్లతో పనిచేసే వారికి ప్రయోజనం చేకూర్చే AI- ఎనేబుల్డ్ టూల్స్ కోసం అన్వేషణ ప్రారంభ దశలో కంపెనీ ఉందని గూగుల్ ప్రతినిధి స్పష్టం చేశారు. కథనాలు సృష్టించడం, వాస్తవాన్ని చెక్ చేయడం వంటి కీలక విషయాలను జర్నలిస్టులే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను నిర్ధారించడంలో జర్నలిస్టుల విలువ, ప్రాముఖ్యతను గుర్తించిందని.. ఇది కేవలం జర్నలిస్టులకు హెడ్‌లైన్ సూచనలు, విభిన్న రచనా శైలి వంటి ఎంపికలను అందించడం, వారి పని , ఉత్పాదకతను మెరుగుపరచడం దీని లక్ష్యమని గూగుల్ నొక్కి చెప్పింది.
వార్తల పరిశ్రమలో AI ప్రయోజనాలు ఉన్నప్పటికీ AI- రూపొందించిన సమాచారం సరికాని సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితమైన రిపోర్టింగ్ , వాస్తవిక కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తూనే జర్నలిస్టులను శక్తివంతం చేసే సాధనాలను అభివృద్ధి చేయడానికి వార్తా ప్రచురణకర్తలతో కలిసి పని చేయడానికి Google కట్టుబడి ఉందని తెలిపింది.
డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్‌ప్లేస్‌లో దాని ఆధిపత్యానికి సంబంధించిన చట్టపరమైన సవాళ్లను Google ఎదుర్కొంది. జూన్‌లో Googleకి వ్యతిరేకంగా USలో అతిపెద్ద పబ్లిషర్ అయిన Gannett ఫెడరల్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం డిజిటల్ అడ్వర్టైజింగ్ పరిశ్రమలో పోటీని, దేశవ్యాప్తంగా న్యూస్‌రూమ్‌లు, కంటెంట్‌లో పెట్టుబడిని ప్రోత్సహించడం వ్యతిరేకిస్తూ దాఖలైంది.