ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ని బాధ్యతా యుతంగా నిర్మించడంలో డెవలపర్లు, పరిశోధలకు సహకరించేందుకు గూగుల్ కొత్త ఓపెన్ మోడల్ Gemma ను విడుదల చేసింది. జెమ్మా అనే లాటిన్ పదం.. దీనర్థం విలువైన రాయి. ఇది జెమిని మోడల్ ఆధారంగా నిర్మితమైన తేలికపాటి మోడల్స్ సమూహం. గూగుల్ డీప్ మైండ్ , ఇతర యూనిట్లు కలిసి అభివృద్ధి చేశాయి.
Gemma రెండు ప్రీ ట్రైన్డ్ , ఇన్ స్ట్రక్షన్ ట్యూన్ వేరియంట్లు Gemma 2B, Gemma 7B తో వస్తుంది.
Responsible AI Toolkit : Google gemma సురక్షితమైన AI అప్లికేషన్లను రూపొందించే టూల్ కిట్ అందిస్తుంది.
ఫ్రేమ్ వర్క్ మద్దతు : JAX, PyTorch, TensorFlow వంటి ప్రధాన ఫ్రేమ్ వర్క్ లకోసం ఫైన్ ట్యూనింగ్ (SFT) టూల్ చైన్లను Gemma అందిస్తుంది.
Gemma మోడల్స్ వివిధ ఫ్లాట్ ఫారమ్ లపై సులభంగా అప్లయ్ చేయొచ్చు. Colab, Kaggle వంటి సాధనాలతో సజావుగా అనుంధానించబడతాయి.
కమర్షియల్ పరంగా : అన్ని సంస్థలకు కమర్షియల్ వినియోగం కోసం Gemma ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Gemma పనితీరు: Gemma మోడల్ష చాలా తేలికైనవి అయినప్పటికీ పెద్ద మోడళ్లతో పోలిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. వీటిని నేరుగా డెవలపర్ల పరికరాల్లో వినియోగించవచ్చు. సేఫ్టీ, రెస్పాన్సిబుల్ అవుట్ ఫుట్ ను అందిస్తుంది.
Google Gemma రూపకల్పనలో AI ప్రిన్సిపుల్స్ నొక్కి చెబుతుంది. ట్రైనింగ్ సెట్స్ నుంచి సున్నితమైన డేటాను ఫిల్టర్ చేయడానికి ఆటోమేటిక్ సిస్టమ్ ను వినియోగించబడుతుంది. నమ్మదగిన, సురక్షితమైన విస్తృతమైన అవుట్ పుట్ అందిస్తుంది.
Gemma ద్వారా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో డెవలపర్లకు బాధ్యతాయుతమైన జనరేటివ్ AI టూల్ కిట్ కూడా అందిస్తుంది. Gemma గురించి ai.google.dev/gemma లో సెర్చింగ్ చేయొచ్చు. Gemma తో కనెక్ట్ అవ్వడానికి , తెలుసుకోవడానికి , నిర్మించడానికి మరో వారం రోజులు వేచి చూడాల్సిందే. అంటే జెమ్మా వచ్చే వారం అందరికి అందుబాటులోకి రాబోతోంది.